కృష్ణ నది ప్రవాహాన్ని పరిశీలించిన సీఎం చంద్రబాబు

ఆంధ్ర ప్రదేశ్ సీఎం చంద్రబాబు ఆదివారం కృష్ణానది ప్రవాహాన్ని పరిశీలించారు. విజయవాడ కనకదుర్గ వారధిపై ఆగి నది ప్రవాహ తీవ్రత వివరాలను అధికారులను అడిగి తెలుసుకున్నారు. రేపటికల్లా ప్రకాశం బ్యారేజీకి 10 లక్షల క్యూసెక్కులకుపైగా వరద వచ్చే అవకాశం ఉందని చంద్రబాబు అంచనా వేశారు. దిగువ ప్రాంతాల్లో సహాయక చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. 

అనంతరం విజయవాడ వరద ప్రభావిత ప్రాంతాలను పరిశీలించడానికి బయలుదేరారు. 17వేల మందిని క్యాంపుల్లోకి తరలించామని వివరించారు. ఏపీలోని పలు జిల్లాల్లో కురుస్తున్న భారీ వర్షాలకు విజయవాడలోని ప్రకాశం బ్యారేజీకి వరద ఉదృతి క్రమంగా పెరుగుతోంది. వరద పొటెత్తడంతో పలు బోట్లు కొట్టుకొచ్చి బ్యారేజ్‌లోని గేట్లు ఢీకొట్టాయి.