ఐదోసారి కూడా నేనే సీఎంగా వస్తా.. సీఎం చంద్రబాబు

ఐదోసారి కూడా నేనే సీఎంగా వస్తా.. సీఎం చంద్రబాబు

ఏపీ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు శుక్రవారం ( నవంబర్ 22, 2024 ) ముగిశాయి. 11రోజుల పటు సాగిన అసెంబ్లీ సమావేశాలు ఇవాళ నిరవధికంగా వాయిదా పడ్డాయి. బడ్జెట్ సమావేశాల ముగింపురోజున సభలో మాట్లాడుతూ సీఎం చంద్రబాబు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఏపీలో చంద్రబాబు 4.0 వర్షన్ ఇప్పుడే మొదలైందని.. ఐదోసారి కూడా తానే సీఎంగా వస్తానంటూ ధీమా వ్యక్తంచేశారు చంద్రబాబు. 

ఈ క్రమంలో నెక్స్ట్ సీఎం కూడా తానేనని  చెప్పకనే చెప్పారు చంద్రబాబు.మంచి చేసే వారిని ప్రజలు మళ్లీ మళ్లీ గెలిపిస్తారని, కొన్ని రాష్ట్రాలలో ఒకే పార్టీ 30 ఏళ్లు పాలించిన విషయాన్ని ఉదహరించారు చంద్రబాబు.వెల్తీ, హెల్తీ, హ్యాపీ ఆంధ్రప్రదేశ్ నినాదంతో తమ ప్రభుత్వం పనిచేస్తోందని.. టీమ్ లీడర్‌గా తాను పనిచేస్తానని, సభ్యులంతా ఇందుకోసం కృషి చేయాలంటూ సూచించారు చంద్రబాబు.