ఏపీలో ఇక ఇసుక ఫ్రీ.. ఎవరైనా.. ఎంతైనా తోడుకోవచ్చు

ఏపీలో ఇక ఇసుక ఫ్రీ.. ఎవరైనా.. ఎంతైనా తోడుకోవచ్చు

ఏపీలో ఇకపై కొత్త సాండ్ పాలసీ రానుంది. గతానికి ఇప్పటికి మార్పు కనబడాలని.. కూటమి ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఇసుక, రోడ్లు, నిత్యావసర వస్తువుల ధరలపై ఇవాళ సీఎం సమీక్ష నిర్వహించారు. ఈ నెల 8 ( జూలై 8, 2024 ) నుండే ఉచిత ఇసుక విధానం అమల్లోకి తేవాలని ఆదేశాలు జారీ చేశారు చంద్రబాబు. తక్షణమే ఇసుక అందుబాటులోకి రావాలి అధికారులకు సీఎం చంద్రబాబు ఆదేశాలు కూడా జారీ చేశారని తెలుస్తుంది. 

  వైసీపీ హయాంలో నిర్మాణ రంగంలో సంక్షోభం ఏర్పడిందని ఇసుక కొరత, ధరల భారంతో పనుల్లేక కార్మికుల విలవిలాడారని సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు చాలా సార్లు ధర్నాలు చేసిన విషయం తెలిసింది. వేల కోట్ల దోపిడీకి పాల్పడ్డ ప్రైవేటు ఏజెన్సీలకు ఇచ్చారని విమర్శించారు. అందుకే ప్రభుత్వం వచ్చిన కొద్ది రోజులకే ఇసుక అందుబాటులోకి తెచ్చి సామాన్యులకు చేరువ చేయాలని ప్రభుత్వం యోచిస్తున్నట్లుసమాచారం.

Also Read:జూలై 8న విజయవాడలో వైఎస్ఆర్ జయంతి వేడుకలు