![ప్రధాని మోడీని కలిసిన సీఎం చంద్రబాబు.. బడ్జెట్ నిధులపై విజ్ఞప్తి..](https://static.v6velugu.com/uploads/2024/08/cm-chandrababu-met-pm-modi-and-requested-to-release-funds_LJZrnGKU39.jpg)
ఏపీ సీఎం చంద్రబాబు ఢిల్లీ పర్యటనలో భాగంగా ప్రధాని మోడీని కలిశారు. శనివారం ఢిల్లీ బయల్దేరి వెళ్లిన చంద్రబాబు మోడీని కలిసి బడ్జెట్ నిధులు సత్వరమే విడుదల చేయాలని విజ్ఞప్తి చేశారు. అమరావతి పునర్నిర్మాణానికి నిధులు విడుదల చేసి సహకరించాలని కోరారు.పోలవరం త్వరితగతిన పూర్తి చేయాలని విజ్ఞప్తి చేశారు.
రుణాల రీషెడ్యూల్ తో పాటు ఏపీ ఆర్థిక అంశాలపై మోడీతో చర్చించారు చంద్రబాబు. మోడీతో భేటీ అనంతరం పలువురు కేంద్ర మంత్రులను కలిసిన చంద్రబాబు ఆదివారం ( ఆగస్టు 18, 2024 ) మధ్యాహ్నం 12 గంటలకు బయల్దేరి 2:30గంటలకు అమరావతి చేరుకోనున్నారు.