కరుడు గట్టిన ఉగ్రవాది కూడా అమరావతిని వ్యతిరేకించరు... సీఎం చంద్రబాబు

ఏపీకి సీఎంగా నాలుగవసారి బాధ్యతలు చేపట్టిన చంద్రబాబు పాలనాపరంగా తన మార్క్ ప్రక్షాళన దిశగా అడుగులేస్తున్నారు. సీఎంగా బాధ్యతలు చేపట్టిన వెంటనే వరుస సమీక్షలతో అధికారులను పరుగులు పెట్టిస్తున్నారు. ఇటీవల పోలవరంపై శ్వేతపత్రాన్ని విడుదల చేసిన చంద్రబాబు తాజాగా రాజధాని అమరావతిపై శ్వేతపత్రం విడుదల చేశారు. ఈ సందర్బంగా కీలక వ్యాఖ్యలు చేశారు చంద్రబాబు.అమరావతికి ఒక సెంటిమెంట్ ఉందని, బుద్ధి జ్ఞానం ఉన్న ఏ వ్యక్తి కూడా అమరావతిని వ్యతిరేకించరని అన్నారు. కరుడు గట్టిన ఉగ్రవాది కూడా దీన్ని ఒప్పుకొని తీరుతారని అన్నారు.

అమరావతి ప్రజా రాజధాని అని, దేశ చరిత్రలోనే రాజధానిని ఎవరూ మార్చలేదని అన్నారు. అలాంటిది, జగన్ రాజధానిలో విధ్వంసం సృష్టించి ప్రజలకు నష్టం తలపెట్టారని మండిపడ్డారు. అమరావతిపై ఇన్వెస్టర్లు నమ్మకం కోల్పోయేలా చేశారని అన్నారు. ఎటు చూసినా సముద్రం ఉన్న ఏకైక ప్రాంతం అమరావతి అని అన్నారు. శాతవాహనుల కాలంలో అమరావతి కేంద్రంగా పాలన జరిగిందని అన్నారు. అమరావతి చరిత్ర సృష్టించే నగరమని, ప్రధాని మోడీ అమరావతికి శంకుస్థాపన చేశారని గుర్తు చేశారు చంద్రబాబు.