జగన్ విధ్వంసంతోనే పోలవరం ప్రాజెక్టుకు నష్టం.. సీఎం చంద్రబాబు

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా నాలుగవసారి బాధ్యతలు చేపట్టిన చంద్రబాబు వరుస సమీక్షలు నిర్వహిస్తూ పోలవరం ప్రాజెక్టుపై స్పెషల్ ఫోకస్ పెట్టారు. ఇప్పటికే పలుమార్లు అధికారులతో సమీక్షలు నిర్వహించిన చంద్రబాబు తాజాగా పోలవరంపై శ్వేతపత్రం విడుదల చేశారు.ఈ సందర్బంగా చంద్రబాబు మాట్లాడుతూ మాజీ సీఎం జగన్ పై ఘాటైన వ్యాఖ్యలు చేశారు. దుష్ప్రచారానికి చెక్ పెట్టి, వాస్తవ పరిస్థితులను గురించి ప్రజలకు తెలిపేందుకే  పోలవరంపై శ్వేతపత్రం విడుదల చేస్తున్నామని అన్నారు.పోలవరం రాష్ట్రానికి జీవనాడి అని, అలాంటి జీవనాడిని అహంతో నాశనం చేశాడని మండిపడ్డారు.

జగన్ మూర్ఖత్వంతోనే డయాఫ్రామ్ వాల్ కొట్టుకుపోయిందని అన్నారు. పోలవరం ప్రాజెక్టులో అవినీతి జరిగిందని అనవసరంగా తమపై బురద చల్లారని అన్నారు.పోలవరం విషయంలో జగన్ క్షమించరాని తప్పు చేసారని అన్నారు. ప్రస్తుతం పోలవరం పరిస్థితి చూస్తే బాధేస్తోందని, ప్రాజెక్టు పరిస్థితి అయోమయంగా ఉందని అన్నారు. అర్హత లేనివారికి అధికారం ఇస్తే ఏం జరుగుతుందో చెప్పటానికి పోలవరం ఉదాహరణ అన్ని అన్నారు.

పోలవరం పూర్తయ్యింటే తెలంగాణ వంటి పక్క రాష్ట్రాలకు కూడా నీళ్లిచ్చే పరిస్థితిలో ఏపీ ఉండేదని అన్నారు. ప్రాజెక్టు కోసం కేంద్రం నుండి వీలైనంత ఎక్కువ నిధులు తీసుకొస్తామని అన్నారు. ప్రాజెక్టు విషయంలో నిపుణులు, మేధావుల సలహాలు తీసుకుంటామని అన్నారు సీఎం చంద్రబాబు.పోలవరంతో పాటు 7అంశాలపై శ్వేతపత్రం విడుదల చేస్తామని,అన్ని శ్వేతపత్రాలు వెబ్సైట్ లో ఉంచుతామని అన్నారు చంద్రబాబు.