మంత్రి రాంప్రసాద్ రెడ్డి సతీమణి ప్రవర్తనపై చంద్రబాబు ఆగ్రహం

ఏపీ మంత్రి  రాంప్రసాద్ రెడ్డి సతీమణి హరితారెడ్డి ప్రవర్తనపై సీఎం చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. పోలీసులతో మంత్రి భార్య.. దురుసుగా ప్రవర్తించారంటూ సోషల్ మీడియాలో వీడియో వైరల్ అయ్యింది. దీనిపై స్పందించిన సీఎం చంద్రాబు హరితారెడ్డి ప్రవర్తపై అసహనం వ్యక్తం చేశారు.

ఈ ఘటనపై  మంత్రి రాంప్రసాద్ రెడ్డితో ఫోన్ లో మాట్లాడిన చంద్రాబా... వివరణ కోరినట్లు తెలుస్తోంది. అధికారుల పట్ల గౌరవంగా ఉండాలని.. దురుసుగా ప్రవర్తిస్తే సహించేది లేదని మండిపడినట్లు సమాచార. మళ్ళీ ఇలాంటి ఘటనలు జరగకుండా చూసుకోవాలని మంత్రికి సీఎం సూచించారు. ప్రభుత్వానికి చెడ్డపేరు తీసుకొచ్చేలా ప్రవర్తిస్తే చర్యలు తప్పవని చంద్రబాబు హెచ్చారించారు.  దీంతో ఘటనపై మంత్రి విచారం వ్యక్తంచేస్తూ.. అలాంటి పొరపాట్లు మళ్లీ జరగకుండా చూసుకుంటానని సీఎం చంద్రబాబుకు తెలిపారు.

అసలేం జరిగిందంటే..  ఉమ్మడి కడప జిల్లా రాయచోటిలో తనకు కూడా ఎస్కార్ట్ గా రావాలని మంత్రి భార్య హరితారెడ్డి పోలీసులను కోరారు. అయితే, పోలీసులు అంగీకరించకపోవడంతో.. ఆమె వారితో వాదించారు. పోలీసులతో దురుసుగా ప్రవర్తించారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.