![పద్ధతి ప్రకారం పనిచేయడం నేర్చుకోండి.. కలెక్టర్, టీటీడీ అధికారులకు సీఎం చంద్రబాబు క్లాస్](https://static.v6velugu.com/uploads/2025/01/cm-chandrababu-serious-warning-to-collector-and-officers-on-tirupati-incident_z69d3LlNUk.jpg)
తిరుపతి తొక్కిసలాట ఘటనపై సీఎం చంద్రబాబు నాయుడు ఆగ్రహం వ్యక్తంచేశారు. టోకెన్లు జారీ చేసే విషయంలో సరైన ఏర్పాట్లు ఎందుకు చేయలేదని కలెక్టర్, టీటీడీ అధికారులపై సీరియస్ అయ్యారు. ముందస్తు జాగ్రత్త చర్యలు తీసుకోకుండా అలసత్వం వహించినందుకు అధికారులపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.
తిరుపతి తొక్కిసలాటలో గాయపడి స్విమ్స్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న క్షతగాత్రులను పరామర్శించిన అనంతరం అధికారులను అడిగి వవరాలు తెలుసుకున్నారు. మెరుగైన వ్యైద్యం అందించాలని అధికారులకు సూచించారు. ఈ సందర్భంగా తొక్కిసలాట ఘటనపై అధికారులపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. పద్ధతి ప్రకారం పనిచేయడం నేర్చుకోండని మందలించారు. టోకెన్ల కోసం భక్తులు ఎక్కువగా వచ్చే అవకాశం ఉందని తెలిసి పటిష్ట భద్రత ఎందుకు ఏర్పాటు చేయలేకపోయారని, ఇలాంటి ఘటనలు మరోసారి పునరావృతం కాకూడదని కలెక్టర్, అధికారులకు వార్నింగ్ ఇచ్చారు.
ALSO READ | తిరుపతి దుర్ఘటన.. బాధిత కుటుంబాలకు రూ.25 లక్షల చొప్పున పరిహారం
వైకుంఠ ద్వార సర్వదర్శనం టోకెన్ల కోసం భక్తులు భారీగా తరలిరావడంతో బుధవారం (08 జనవరి 2025) తోపులాట జరిగిన విషయం తెలిసిందే. ఈ ఘటనలో ఆరుగురు మృతి చెందగా, దాదాపు 40 మంది అస్వస్థతకు గురయ్యారు. చనిపోయినోళ్లలో ఐదుగురు మగవాళ్లు, ఒక మహిళ ఉన్నారు. అస్వస్థతకు గురైన వాళ్లలో 20 మంది రుయా ఆస్పత్రిలో, మరో 9 మంది స్విమ్స్ ఆస్పత్రిలో ట్రీట్ మెంట్ పొందుతున్నారు.