తిరుమల వెంకటేశ్వర స్వామి లడ్డూ ప్రసాదంపై సీఎం చంద్రబాబు సంచలన వ్యాఖ్యలు చేశారు. గత ప్రభుత్వం తిరుపతి లడ్డూ తయారీ కోసం నెయ్యికి బదులు జంతు నూనె వాడినట్లు తన దృష్టికి వచ్చిందన్నారు. తిరుపతి లడ్డూ ప్రసాదాన్ని గత ప్రభుత్వం అపవిత్రం చేసిందని, నాసిరకమైన సరుకులు వాడడమే కాకుండా నెయ్యికి బదులు యానిమల్ ఫ్యాట్ కూడా వాడారని తెలిసిందన్నారు.
ALSO READ | సెప్టెంబర్ 19న విడుదల కానున్న డిసెంబర్ నెల టీటీడీ దర్శనం టికెట్లు.
గత ప్రభుత్వ నిర్వాకం తెలిసి భయపడ్డానని అన్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే స్వచ్ఛమైన నెయ్యిని తెప్పించి.. లడ్డూ ప్రసాదం తయారీ కోసం వాడుతున్నామని అన్నారు. గత పాలకులు అన్నదానం విషయంలో కూడా నిర్లక్ష్యం వహించారని, అన్న ప్రసాద నాణ్యతను కూడా దెబ్బతీశారని మండిపడ్డారు.
ఇలాంటివన్నీ విన్నప్పుడు బాధగా అనిపించిందని అన్నారు. తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక లడ్డూ ప్రసాదంలో, అన్నదానంలో నాణ్యత పాటిస్తున్నామని, నాణ్యతను ఇంకా మెరుగుపరుస్తామని అన్నారు సీఎం చంద్రబాబు.