ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా నాలుగవసారి బాధ్యతలు చేపట్టిన తర్వాత సీఎం చంద్రబాబు తొలిసారి కుప్పంలో పర్యటించారు. రెండురోజుల పాటు కుప్పంలో పర్యటించనున్న చంద్రబాబు కుప్పం బస్టాండు సెంటర్లో ఏర్పాటు చేసిన భారీ బహిరంగసభలో పాల్గొన్నారు.ఈ సభలో కుప్పం ప్రజలను ఉద్దేశించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు చంద్రబాబు. ఇటీవల జరిగిన ఎన్నికల్లో చారిత్రాత్మక విజయం అందించారని, కుప్పం ప్రజలు తనను 8సార్లు ఎమ్మెల్యేగా గెలిపించారని అన్నారు.
మళ్ళీ జన్మంటూ ఉంటే కుప్పంలోనే పుడతానని అన్నారు చంద్రబాబు.రాబోయే ఐదేళ్ళలో కుప్పం ప్రజల ఋణం తీర్చుకుంటానని అన్నారు. ఎవరైనా కుప్పంలో రౌడీయిజం చేస్తే అదే వారికి చివరి రోజు అవుతుందని హెచ్చరించారు. కుప్పంను అభివృద్ధికి నమూనాగా తయారు చేస్తానని, అన్నారు.ఔటర్ రింగ్ రోడ్, అండర్ గ్రౌండ్ డ్రైనేజి ఏర్పాటు చేస్తామని, కుప్పంలో ప్రతి గ్రామాన్ని అభివృద్ధి చేస్తామని హామీ ఇచ్చారు.