సిఫార్సులు చెల్లవు.. పనిచేస్తేనే పదవులు.. సీఎం చంద్రబాబు

సిఫార్సులు చెల్లవు.. పనిచేస్తేనే పదవులు.. సీఎం చంద్రబాబు

మంగళగిరిలో  శనివారం (  మార్చి 29 ) టీడీపీ 43వ ఆవిర్భావ సభలో పాల్గొన్న సీఎం చంద్రబాబు కీలక వ్యాఖ్యలు చేశారు. కార్యకర్తలను ఉద్దేశించి మాట్లాడిన ఆయన ఎవరు సిఫార్సు చేసినా పదవులు ఇవ్వనని.. పనితీరు ఆధారంగానే పదవులు ఇస్తానని అన్నారు. ఎన్టీఅర్ ఒక యుగపురుషుడని..  ఆదర్శం కోసం పుట్టిన పార్టీ టీడీపీ అని అన్నారు. టీడీపీ ఆవిర్భావమే సంచలనమని.. 9నెలల్లో అధికారంలోకి రావడం ఎవరికీ సాధ్యంకాని ఘనత ఎన్టీఆర్ సాదించారని అన్నారు చంద్రబాబు. 

యువతను రాజకీయాల్లోకి తెచ్చిన నేత ఎన్టీఆర్ ది అని.. తనకు అప్లికేషన్లు పెట్టుకుంటే పదవులురావని..క్షేత్రస్థాయిలో పని చేసిన వాళ్లకే పదవులని అన్నారు. ఎవరు సిఫార్సు చేసినా పదవులు ఇవ్వనని..పనితీరు ఆధారంగానే పదవులు ఇస్తానని అన్నారు చంద్రబాబు. 

ALSO READ : తిరుమల కొండపై బెల్ట్ షాపు

తెలుగుజాతి ఉన్నంతకాలం టీడీపీ ఉంటుందని.. మనం వారసులమే కానీ పెత్తందారులం కాదని అన్నారు. టీడీపీ నాశనానికి ప్రయత్నించిన వాళ్లు..కాలగర్భంలో కలిసిపోయారని సంచలన వ్యాఖ్యలు చేశారు చంద్రబాబు.