రానున్న రోజుల్లో అన్ని దేశాల్లో తెలుగు భాషను గుర్తిస్తారు: సీఎం చంద్రబాబు

రానున్న రోజుల్లో అన్ని దేశాల్లో తెలుగు భాషను గుర్తిస్తారు: సీఎం చంద్రబాబు

12వ ద్వైవాషిక ప్రపంచ తెలుగు మహాసభలు హైదరాబాద్ లో ఘనంగా ప్రారంభమయ్యాయి. ఈ సభలను ప్రారంభించిన ఏపీ సీఎం చంద్రబాబు కీలక వ్యాఖ్యలు చేశారు.తెలుగు వారందరినీ ఒకే వేదిక పైన చూడడం సంతోషంగా ఉందని.. ప్రతి రెండు ఏండ్లకు ఈ సభను ఏర్పాటు చేసే ఈ సభలు నందమూరి తారక రామారావు చేతుల మీదుగా ప్రారంభమయ్యాయని అన్నారు.అమెరికాలో 12వ భాషగా తెలుగును గుర్తించారని..రానున్న రోజుల్లో అన్ని దేశాల్లో తెలుగును గుర్తిస్తారని అన్నారు చంద్రబాబు.

గతంలో తాను తెలుగు మహాసభలకు హాజరైనప్పుడే హైటెక్ సిటీని డెవలప్ చేస్తానని చెప్పానని.. ఈరోజు హైటెక్ సిటీ ఎలా డెవలప్ ఐయిందో అందరికి తెలుసని అన్నారు.హైదరాబాద్ సికింద్రాబాద్ ఒక ఎత్తయితే...సైబరాబాద్ అభివృద్ధి మరో ఎత్తు అని అన్నారు చంద్రబాబు.ప్రపంచంలో అమెరికా లాంటి దేశంలో ఎక్కువ తలసరి ఆదాయం సంపాదించేది తెలుగు వారేనని అన్నారు.జూబ్లీహిల్స్ పోష్ ఏరియా అని ఎలా అంటారో.. ప్రస్తుతం ఏ దేశంలో అయినా తెలుగు వారు ఉడేదే పోష్ ఏరియా అని అన్నారు చంద్రబాబు.

ఏ దేశానికి పోయిన మన దేశాన్ని మర్చిపోవద్దని.. జన్మభూమికి, కర్మ భూమికి సేవలు చేయాలని అన్నారు. ఆ రోజు ఒక్కో ఇంట్లో ఒక ఐటి ప్రొఫెషనల్ ఉండాలని అన్నానని..ఈరోజు ఐటీ నెక్స్ట్ లెవెల్ లో ఉందని అన్నారు.అందరూ పారిశ్రామికవేత్తలుగా ఎదగాలని అన్నారు. హైటెక్ సిటీ నిర్మాణం చేసినప్పుడు మంచి ఐడియాస్ తో ముందుకు వెళ్ళామని అన్నారు. తన విజన్ 2020 చూసారని.. ఈరోజు మోడీ విజన్ 2047కి భారతదేశం ప్రపంచంలో నెంబర్ 1లేదా 2 స్థానంలో ఉంటుందని అన్నారు చంద్రబాబు. 

ALSO READ | హీరోయిన్ మాధవి లతపై జేసి ప్రభాకర్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు

తెలుగు వారు ఎక్కడ ఉన్నా అందరం ఒక్కటనే గుర్తు పెట్టుకోవాలని.. ఏపీ అభివృద్ధిలో అందరూ భాగస్వామ్యం కావాలని కోరుతున్నానని అన్నారు.తెలుగు వారికి ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు తెచ్చిన వ్యక్తి ఎన్టీఆర్ అని, పొట్టి శ్రీరాములు త్యాగాలను కూడా తెలుగు వారు గుర్తు పెట్టుకోవాలని అన్నారు చంద్రబాబు. గిడుగు రాం మూర్తి, రామోజీరావు లాంటి వారు తెలుగు భాష కోసం కష్టపడ్డారని.. బాలయోగి, వెంకయ్యనాయుడు, జస్టిస్ రమణ, వంటి వారు ఉన్నతమైన రంగాల్లో రాణించారని అన్నారు.

మల్లీశ్వరి, హంపి, వెంకటపతిరాజు, నితీష్ కుమార్ రెడ్డి, గోపిచంద్ లాంటి వారి క్రీడల్లో రాణించారని, తెలుగు సినిమా ఇండస్ట్రీ కూడా దేశంలోనే నెంబర్ 1 కావడం గర్వకారణమని అన్నారు.బతుకమ్మ తెలంగాణ సంప్రదాయం..మన సంప్రదాయాలు మర్చిపోకుండా ఉండాలని అన్నారు చంద్రబాబు. 2047కి ప్రపంచంలో తెలుగు జాతి నెంబర్1 ఉండాలని తన ఆకాంక్ష అని.. అది సాధించడానికి అంతా దృఢ నిశ్చయంతో ముందుకు వెళ్లాలని అన్నారు.ఒక్కపుడు హార్డ్ వర్క్ చేసాము..ఇప్పుడు స్మార్ట్ వర్క్ చేయాలని కోరుతున్నానని అన్నారు.

టెక్నాలజీని సద్వినియోగం చేసుకుంటే ప్రపంచాన్ని సశించోచ్చు, దుర్వినియోగం చేస్తే పరిణామాలు వేరే విదంగా ఉంటాయని అన్నారు చంద్రబాబు. తెలుగు జాతి అంతా ఒక్కటే..మనకు విబేధాలు లేవని.. నాకు వీలైనంత వరకు తెలుగు జాతి కోసం పని చేస్తానని అన్నారు చంద్రబాబు.