బెల్టు షాపులు పెడితే బెల్టు తీస్తా: సీఎం చంద్రాబాబు స్ట్రాంగ్ వార్నింగ్

బెల్టు షాపులు పెడితే బెల్టు తీస్తా: సీఎం చంద్రాబాబు స్ట్రాంగ్ వార్నింగ్

అసెంబ్లీలో మద్యం పాలసీపై మాట్లాడుతూ.. బెల్టుషాపుల విషయంలో సీఎం చంద్రబాబు కీలక వ్యాఖ్యలు చేశారు. మద్యం అమ్మకాలు పారదర్శకంగా ఉండాలని, కేవలం వైన్ షాపుల ద్వారా మాత్రమే అమ్మకాలు జరగాలని అన్నారు. ఎవరైనా బెల్టు షాపులు పెడితే వారి బెల్టు తీస్తామని స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు చంద్రబాబు. బెల్టు షాపులు లేకుండా స్థానిక ఎమ్మెల్యేలు చూసుకోవాలని అన్నారు. ఎవరైనా క్రైమ్ కు పాల్పడితే తాట తీస్తానని మాస్ వార్నింగ్ ఇచ్చారు. 

ఆడపిల్లలు, మహిళలపై సోషల్ మీడియాలో ఎవరైనా అసభ్యకర పోస్టులు పెడితే అదే వారికి ఆఖరి రోజు అవుతుందని హెచ్చరించారు.  నాలుగు దశాబ్దాలుగా ప్రజలు తనను ఆదరించారని, ఎక్కువసార్లు ప్రజలు తనను సీఎం చేశారని అన్నారు. వైసీపీ హయాంలో తనను ఎన్నో ఇబ్బందులకు గురి చేశారని,జైలుకు కూడా పంపించారని అన్నారు. అధికారం ఉన్నా, లేకున్నా తాను ప్రజల కోసమే పని చేశానని అన్నారు.

ALSO READ | మరో పదేళ్లు చంద్రబాబు సీఎంగా ఉండాలి: డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్

వైసీపీ పాలనలో ఏపీ వెంటిలేటర్ పైకి వెళ్లిందని, కీలక సమయంలో ప్రజలు తమకు ఘన విజయం అందించారని అన్నారు. కేంద్రం అన్ని విధాలుగా  సాయం చేస్తోందని... రాష్ట్రం ఇప్పుడిప్పుడే గాడిలో పడుతోందని అన్నారు చంద్రబాబు.అధికారంలోకి రాగానే పెన్షన్లు రూ. 4 వేలకు పెంచామని, 64 లక్షల మందికి పెన్షన్లు అందిస్తున్నామని వెల్లడించారు. వైసీపీ పాలనలో రూ. 10 లక్షల కోట్ల అప్పులు చేశారని మండిపడ్డారు. అప్పులను లెక్కలతో సహా అసెంబ్లీలో చూపించామని అన్నారు.