మరోసారి పెన్షన్ పంపిణీ చేయనున్న సీఎం చంద్రబాబు.. 

ఏపీకి నాలుగవసారి ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన చంద్రబాబు జూలై 1న లబ్ధిదారుల ఇంటికి నేరుగా వెళ్లి పెన్షన్ పంపిణీ చేసిన సంగతి తెలిసిందే. లబ్ధిదారుల ఇంటికి స్వయంగా వెళ్లి నగదు పంపిణీ చేసిన మొదటి సీఎంగా నిలిచారు చంద్రబాబు. మరోసారి లబ్ధిదారుల ఇంటికి వెళ్లి పెన్షన్ పంచేందుకు సిద్ధమయ్యారు చంద్రబాబు. ఆగస్టు 1న మడకశిర నియోజకవర్గంలో పర్యటించనున్న చంద్రబాబు.. గుండుమలలో పెన్షన్ పంపిణీ చేయనున్నారు.

చంద్రబాబు పర్యటన నేపథ్యంలో అధికారులు, ప్రజాప్రతినిధులతో ఆదివారం ప్రత్యేక సమీక్ష నిర్వహించారు. ఈ సమీక్షకు మంత్రి సవిత, ఎమ్మెల్యేలు ఎంఎస్ రాజు, సింధూర రెడ్డి,కందికుంట వెంకటప్రసాద్ తదితరులు హాజరయ్యారు.ఈ క్రమంలో సూపర్ 6అమలుపై ప్రతిపక్ష వైసీపీ ఆరోపణలు చేస్తున్న నేపథ్యంలో లబ్ధిదారుల ఇంటికి వెళ్లి పెన్షన్ పంపిణీ చేయటం ద్వారా విమర్శలకు చెక్ చెప్పనున్నారు.