శ్రీవారిని దర్శించకున్న సీఎం చంద్రబాబు

తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు ఏపీ సీఎం చంద్రబాబు.  కుటుంబ సభ్యులతో కలిసి స్వామివారిని దర్శించుకొని మొక్కులు చెల్లించుకున్నారు. దర్శనం తర్వాత ఆలయ రంగనాయక మంటపంలో వేదపండితులు వేద ఆశీర్వచనం అందించారు. టీటీడీ అధికారులు శేషవస్ర్తంతో సత్కరించి స్వామివారి తీర్థ ప్రసాదాలు అందజేశారు. 
 
తిరుమల నుంచి బయలుదేరి కాసేపట్లో గన్నవరం ఎయిర్ పోర్టుకు చేరుకుంటారు. అక్కడ నుంచి విజయవాడలో కనకదుర్గ అమ్మవారిని దర్శించుకొని.. ఉండవల్లిలోని నివాసానికి వెళతారు.సాయంత్రం 4గంటల 41 నిమిషాలకు సచివాలయం ఛాంబర్ లో సీఎంగా బాధ్యతలు చేపడతారు. మొదటగా ఐదు ఫైళ్లపైన సంతకాలు చేస్తారు సీఎం చంద్రబాబు.