అచ్యుతాపురం ఘటన బాధాకరం.. సీఎం చంద్రబాబు

అచ్యుతాపురం సెజ్ లోని ఎసెన్షియా ఫార్మా కంపెనీలో జరిగిన ప్రమాదంలో గాయపడ్డవారిని సీఎం చంద్రబాబు పరామర్శించారు. అనకాపల్లిలో మెడికవర్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న బాధితులను కలిసి పరామర్శించారు చంద్రబాబు. ఈ క్రమంలో మీడియాతో మాట్లాడుతూ కీలక వ్యాఖ్యలు చేశారు సీఎం చంద్రబాబు. ప్రమాదంలో మరణించిన వారికి కోటిరూపాయల ఎక్స్ గ్రేషియా ప్రకటించామని, బాధిత కుటుంబాలకు అండగా ఉంటామని భరోసా ఇచ్చారు.

Also Read:-అచ్యుతాపురం ప్రమాదం చాలా బాధాకరం.. డిప్యూటీ సీఎం పవన్

 గత వైసీపీ ప్రభుత్వం వ్యవస్థలన్నిటినీ సర్వనాశనం చేసిందని మండిపడ్డారు.ఈ క్రమంలో బాధితులతో మాట్లాడిన చంద్రబాబు త్వరగా కోలుకునేలా ప్రభుత్వం తరపున అన్ని చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.కాగా, ఈ ఘటనలో 17మంది మరణించగా మరో నలుగురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది.