సోమవారం పోలవారం : పోలవరం ప్రాజెక్టును పరిశీలించిన సీఎం చంద్రబాబు

ఏపీ సీఎం చంద్రబాబు పోలవరం ప్రాజెక్టును పరిశీలించారు. మంత్రులు నిమ్మల రామానాయుడు, కొలుసు పార్థసారథితో పాటు ఎమ్మెల్యేలు, అధికారులు ఆయనకు స్వాగతం పలికారు. అనంతరం ప్రాజెక్టు వద్దకు చేరుకుని అధికారులతో మాట్లాడారు.. పోలవరం అప్ డేట్ గురించి అడిగి తెలుసుకున్నారు. నాలుగో సారి సీఎంగా చంద్రబాబు బాధ్యతలు స్వీకరించిన తర్వాత తొలి పర్యటన ఇదే. 

 గతంలో చంద్రబాబు సీఎంగా ఉన్నప్పుడు సోమవారాన్ని పోలవారంగా పిలుస్తూ సందర్శించి పనుల పురోగతిని పర్యవేక్షించారు. అదే తరహాలో ఇప్పుడూ సోమవారం రోజునే ప్రాజెక్టు సందర్శనను మొదలుపెట్టారు.