అమరావతికి వరద వస్తుందంటూ విమర్శలు చేస్తున్న వైసీపీ నేతలపై సీఎం చంద్రబాబు ఓ రేంజ్ లో ఫైర్ అయ్యారు. అమరావతిపై ఇష్టానుసారం మాట్లాడితే ఊరుకోమని అన్నారు. రాజధాని ప్రాంతానికి వరద వస్తుందంటున్న వాళ్ళ నాలుకకు తాళం వేస్తానని స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు.
అమరావతిని మార్చాలన్న మేధావులకు చెన్నై, ముంబై లాంటి రాజధానులను మార్చమని చెప్పండని అన్నారు. ఏ ప్రాంతంలోనైనా వరదలు వస్తాయని, వరదలు వచ్చినంత మాత్రాన రాజధానిని మార్చమనటం సమంజసం కాదని అన్నారు.
బుడమేరు ప్రాంతంలో ప్రాపర్టీ ట్యాక్స్‌కు గడువు మరో మూడు నెలలు ఇస్తున్నామని తెలిపారు సీఎం చంద్రబాబు. విశాఖ స్టీల్‌ప్లాంట్ విషయంలో వైసీపీ నాయకులు రెచ్చగొడుతున్నారని, ఎన్డీఏ కూటమికి విశాఖ చాలా ముఖ్యమైన నగరమని అన్నారు.కేంద్రమంత్రి కుమారస్వామితో మాట్లాడానని, డబ్బులు ఇచ్చి ప్లాంట్‌ను ముందుకు తీసుకెళ్తామని కేంద్రమంత్రి కుమారస్వామి చెప్పారని అన్నారు. స్టీల్‌ప్లాంట్ ప్రైవేటీకరణ కాకుండా కాపాడుతామని అన్నారు సీఎం చంద్రబాబు.