అన్న క్యాంటిన్లపై చంద్రబాబు మార్క్ ప్రయోగం..

ఏపీలో కొత్తగా ఏర్పడ్డ కూటమి ప్రభుత్వం పాలనపరమైన ప్రక్షాళన దిశగా అడుగులేస్తోంది.ఏపీకి సీఎంగా నాలుగవసారి బాధ్యతలు చేపట్టిన చంద్రబాబు అధికారులతో వరుస సమీక్షలు నిర్వహిస్తూ రాజధాని అమరావతి, పోలవరం ప్రాజెక్ట్ పై స్పెషల్ ఫోకస్ పెట్టారు.గతంలో తన హాయంలో చాలా అంశాల్లో తనదైన ముద్ర వేసిన చంద్రబాబు ఈసారి కూడా అలాంటి ప్రయోగాల దిశగా అడుగులేస్తున్నారు. 2014లో అధికారంలోకి వచ్చాక చంద్రబాబు ప్రారంభించిన అన్న క్యాంటీన్ల విషయంలో వినూత్న ప్రయోగానికి తెర లేపారు చంద్రబాబు.

పేదలకు 5రూపాయలకే నాణ్యమైన భోజనం అందించే ఉద్దేశంతో అప్పటి ప్రభుత్వం ప్రారంభించిన ఈ పథకంలో ప్రజలను కూడా భాగస్వామ్యం చేసేలా ప్లాన్ చేసారు చంద్రబాబు.పుట్టినరోజును పురస్కరించుకొని తమకు దగ్గర్లోని అన్న క్యాంటీన్లలో ఒక రోజు పేదలకు భోజనం పెట్టాలని పిలుపునిచ్చారు. అలా స్పాన్సర్ చేసినవారి ఫోటోలను అన్న క్యాంటీన్లలో ప్రదర్శిస్తామని, పెదాలతో మాట్లాడాలి అనుకుంటే ఆ ఏర్పాట్లు కూడా చేస్తామని అన్నారు చంద్రబాబు.చంద్రబాబు ఇచ్చిన ఈ పిలుపు ప్రస్తుతం హాట్ టాపిక్ గా మారింది.