- తూముకుంట మున్సిపల్ కమిషనర్ వెంకట్ గోపాల్
శామీర్ పేట, వెలుగు : స్టూడెంట్లు క్రీడల్లో రాణించి రాష్ట్ర స్థాయి పోటీలకు ఎంపిక కావాలని తూముకుంట మున్సిపల్కమిషనర్ వెంకట్ గోపాల్ ఆకాంక్షించారు. చదువుతోపాటు క్రీడల్లో రాణించినప్పుడే మంచి భవిష్యత్ఉంటుందన్నారు. ప్రజాపాలన ఏడాది విజయోత్సవాల్లో భాగంగా మంగళవారం తూముకుంటలోని తెలంగాణ స్పోర్ట్స్స్కూల్లో సీఎం కప్-–2024 నిర్వహించారు.
ముఖ్య అతిథిగా కమిషనర్ వెంకట్ గోపాల్ పాల్గొని ప్రారంభించారు. కబడ్డీ, ఖోఖో, అథ్లెటిక్స్ పోటీలను నిర్వహించారు. అనంతరం గెలుపొందిన క్రీడాకారులకు బహుమతులు అందజేశారు. ఎంఈఓ వసంతకుమారి, డీవైఈఈ సునీత, పీడీ సత్తిరెడ్డి తదితరులు పాల్గొన్నారు.