వనపర్తి, వెలుగు: జిల్లా స్థాయి సీఎం కప్- పోటీల్లో భాగంగా బుధవారం ఫుట్ బాల్, హాకీ, వాలీబాల్, చెస్, బాడ్మింటన్ పోటీలు నిర్వహించారు. పోటాపోటీగా జరిగిన క్రీడల్లో క్రీడాకారులు ఉత్సాహంగా పాల్గొన్నారు. వాలీబాల్ బాలుర విభాగంలో మదనాపురం, వీపనగండ్ల జట్లు మొదటి రెండు స్థానాల్లో నిలిచాయి. బాలికల విభాగంలో -ఆత్మకూర్ అర్బన్, -ఆత్మకూర్ రూరల్ జట్లు. చెస్ సబ్ జూనియర్ బాలుర విభాగంలో -చేతన్ సాగర్, -రాబిశ్మొదటి రెండు స్థానాల్లో నిలవగా, సబ్ జూనియర్ ఫైనల్ కు దుర్గ, శ్వేత, వైష్ణవి చేరారు.
బ్యాడ్మింటన్ సబ్ జూనియర్ గర్ల్స్విభాగం-లో విజయలక్ష్మి, హర్షిత, జూనియర్ విభాగంలో వైష్ణవి, సనా బేగం, సబ్ జూనియర్ బాయ్స్ విభాగంలో గాంధీ , జోగేంద్ర, జూనియర్ విభాగంలో సంతోష్, ఆకాశ్ మొదటి రెండు స్థానాల్లో నిలిచారు. పెబ్బేరు, వీపనగండ్ల బాయ్స్ టీమ్లు ఫుట్ బాల్లో ఫైనల్ చేరాయి.