విలేజ్​లెవల్​నుంచే సీఎం కప్ పోటీలు: ఏపీ జితేందర్ రెడ్డి

విలేజ్​లెవల్​నుంచే సీఎం కప్  పోటీలు: ఏపీ జితేందర్ రెడ్డి

పాలమూరు, వెలుగు: గ్రామ స్థాయి నుంచి సీఎం కప్  పోటీలు నిర్వహిస్తామని -ఢిల్లీలో రాష్ట్ర ప్రభుత్వ ప్రతినిధి ఏపీ జితేందర్ రెడ్డి తెలిపారు. మహబూబ్​నగర్​ పట్టణంలోని స్టేడియంలో ఆదివారం 5వ రాష్ట్ర స్థాయి అండర్–16 బాస్కెట్ బాల్ ఛాంపియన్​షిప్​ పోటీలను పాలమూరు ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డితో కలిసి ప్రారంభించారు. క్రీడా పతాకాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గత ప్రభుత్వం క్రీడలను నిర్లక్ష్యం చేసిందని తెలిపారు. ఫుట్ బాల్  క్రీడాకారుడైన సీఎం రేవంత్ రెడ్డి నేతృత్వంలో క్రీడాభివృద్ధికి చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. గతంలో ఎన్నడూ లేనివిధంగా బడ్జెట్‎లో క్రీడల కోసం రూ.364 కోట్లు కేటాయించామని చెప్పారు.

రాష్ట్రంలో స్పోర్ట్  యూనివర్సిటీ ఏర్పాటుకు ప్రయత్నిస్తున్నామన్నారు. ప్రతి పార్లమెంట్  నియోజకవర్గం పరిధిలో ఒక స్పోర్ట్స్​స్కూల్  ఏర్పాటు చేయాలని సీఎం నిర్ణయించినట్లు తెలిపారు. గ్రామీణ స్థాయిలో క్రీడాకారుల ప్రతిభను గుర్తించేందుకు సీఎం కప్  పోటీలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. రాష్ట్ర మైనార్టీ ఫైనాన్స్ కార్పొరేషన్  చైర్మన్  ఒబేదుల్లా కొత్వాల్, మున్సిపల్  చైర్మన్  ఆనంద్ గౌడ్, డీవైఎస్ వో  ఎస్.శ్రీనివాస్, బాస్కెట్  బాల్  అసోసియేషన్  రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నోమన్  ఐజాక్, జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు మక్సూద్  బిన్  అహ్మద్ జాకీర్, నసురుల్లా హైదర్  పాల్గొన్నారు.