సీఎం కప్‌‌ క్రీడా పోటీలు షురూ

హైదరాబాద్, వెలుగు:  సీఎం కప్ క్రీడా పోటీలు రాష్ట్ర వ్యాప్తంగా శనివారం ఘనంగా మొదలయ్యాయి. తొలి అంచెలో భాగంగా..12 వేలకు పైగా గ్రామాల్లో పోటీలు జరుగుతున్నాయి. నల్గొండ పట్టణంలో జరిగిన ప్రజా పాలన ముగింపు  వేడుకలకు హాజరైన సీఎం రేవంత్ రెడ్డి ఈ పోటీలను లాంఛనంగా ప్రారంభించారు. 

బహిరంగ సభలో  సీఎం కప్ అధికారిక గీతాన్ని కూడా విడుదల చేశారు. ఒక్క ఏడాదిలోనే క్రీడా రంగంలో ఎంతో అభివృద్ధిని సాధించి చూపెట్టిన స్పోర్ట్స్‌‌ అథారిటీ ఆఫ్ తెలంగాణ (శాట్జ్‌‌)ను, ఆ సంస్థ చైర్మన్ శివసేనా రెడ్డిని సీఎం అభినందించారు. కార్యక్రమంలో డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క, మంత్రులు వెంకట్​రెడ్డి, ఉత్తమ్ తదితరులు పాల్గొన్నారు.