హనుమకొండలో ఉత్సాహంగా సీఎం కప్ అథ్లెటిక్స్

హనుమకొండలో ఉత్సాహంగా సీఎం కప్ అథ్లెటిక్స్

హనుమకొండ సిటీ, వెలుగు: హనుమకొండలోని జవహర్ లాల్ నెహ్రూ స్టేడియంలో సీఎం కప్ రాష్ట్ర స్థాయి అథ్లెటిక్స్ పోటీలు బుధవారం ఉత్సాహంగా జరిగాయి. అథ్లెటిక్స్ ట్రయాథ్లాన్ బాలుర విభాగంలో భద్రాద్రి కొత్తగూడెం జిల్లాకు చెందిన సాయి ఆదిత్య గోల్డ్, నాగేశ్ (ఆదిలాబాద్) సిల్వర్, 600 మీటర్ల రన్నింగ్ లో రాము (హైదరాబాద్) గోల్డ్, కె బస్వంత్ (నారాయణపేట) సిల్వర్, 100 మీటర్ల రన్నింగ్ లో కె శివకుమార్ (మహబూబ్ నగర్) గోల్డ్, పాయం మనోజ్ కుమార్ (భద్రాద్రికొత్తగూడెం) సిల్వర్  గెలుచుకున్నారు.

వెయ్యి మీటర్ల రన్నింగ్ లో హైదరాబాద్ కు  చెందిన నారాయణ నాయక్ గోల్డ్, కె సుశాంత్ రెడ్డి (మెదక్)కి సిల్వర్ మెడళ్లు దక్కాయి. షాట్ పుట్ లో హనుమకొండకు చెందిన ఎ.రాహుల్ గోల్డ్, వనపర్తికి చెందిన ఎస్ మురళీకృష్ణ సిల్వర్ కైవసం చేసుకున్నారు. 800 మీటర్ల రన్నింగ్ లో కామారెడ్డికి చెందిన మాలవత్ ఈశ్వర్ గోల్డ్, బి ఉమేశ్ కుమార్ (హైదరాబాద్) సిల్వర్ మెడల్, 3000 మీటర్ల రన్నింగ్ రేసులో భువనగిరి జిల్లాకు చెందిన బి చంద్రప్రసాద్ గోల్డ్, కరీంనగర్ కు చెందిన ఎం వినయ్ రన్నర్ గా నిలిచాడు. 

బాలికల  విభాగం: 100 మీటర్ల రన్నింగ్ రేసులో ఖమ్మం జిల్లాకు చెందిన బిబి వైశాలి గోల్డ్, అక్షితరెడ్డి (రంగారెడ్డికి జిల్లా) సిల్వర్, షాట్ పుట్ లో ఖమ్మం జిల్లాకు చెందిన రాజరాజేశ్వరి గోల్డ్, మనస్విని (హైదరాబాద్) సిల్వర్, జావెలిన్ త్రోలో ఖమ్మంకు చెందిన బిందు గోల్డ్, మనీషా (రాజన్న సిరిసిల్ల) సిల్వర్ మెడల్ దక్కించుకున్నారు.

800 మీటర్ల రన్నింగ్ రేసులో నల్గొండ జిల్లాకు చెందిన ఎ అఖిల గోల్డ్, స్వప్న (నాగర్ కర్నూల్) సిల్వర్, 3000 మీటర్ల రన్నింగ్ రేసులో జోగులాంబ గద్వాలకు చెందిన ఎం మల్లిక గోల్డ్, గడ్డం రాజేశ్వరి (నాగర్ కర్నూల్)  సిల్వర్ మెడల్ దక్కించుకున్నారు. 400 మీటర్ల మిక్స్ డ్ రిలేలో భద్రాద్రి కొత్తగూడెం జిల్లాకు చెందిన తోలెం శ్రీతేజ గోల్డ్ మోడల్, శృతి (రంగారెడ్డి)  సిల్వర్ మెడల్ సాధించారు.