సీఎం కప్ రాష్ట్రస్థాయి క్రీడలు శుక్రవారం హనుమకొండ జవహార్లాల్ నెహ్రూ స్టేడియంలో ప్రారంభమయ్యాయి. మాజీ ప్రధాని మన్మోహన్సింగ్ మృతి చెందడంతో సంతాప దినాలుగా ప్రభుత్వం ప్రకటించడంతో పోటీలను ప్రారంభించాల్సిన వీఐపీలు హాజరుకాలేదు.
కాగా, తొలిరోజు జరగిన హ్యాండ్ బాల్ పోటీలు గర్ల్స్ క్యాటగిరీలో హైదరాబాద్, నల్గొండ జట్లు, బాలుర క్యాటగిరీలో కరీంనగర్, నిజామాబాద్ జట్లు ఆడాయి. - వెలుగు, వరంగల్ ఫొటోగ్రాఫర్