హైదరాబాద్, వెలుగు : సీఎం కప్ రాష్ట్ర స్థాయి క్రీడా పోటీలు శుక్రవారం నుంచి జరగనున్నాయి. స్పోర్ట్స్ ఆథారిటీ ఆఫ్ తెలంగాణ (శాట్) ఆధ్వర్యంలో హైదరాబాద్‌తో పాటు కరీంనగర్, హన్మకొండ, వరంగల్, ఖమ్మం, మెదక్, మహబూబ్ నగర్‌లో 36 క్రీడాంశాల్లో పోటీలు నిర్వహిస్తారు.
జవవరి రెండో తేదీ వరకూ ఏడు ప్రాంతాల్లో పోటీలు ఉంటాయని శాట్ తెలిపింది. గ్రామ, మండల, జిల్లా స్థాయిల్లో పోటీల్లో ప్రతిభ చూపిన క్రీడాకారులకు రాష్ట్ర స్థాయికి ఎంపిక చేశారు. స్టేట్ లెవెల్ పోటీలను సక్సెస్ చేసేందుకు అన్ని ఏర్పాట్లు చేసినట్టు శాట్ తెలిపింది.