ముగిసిన సీఎం కప్ రాష్ట్ర స్థాయి జూడో పోటీలు

ముగిసిన సీఎం కప్ రాష్ట్ర స్థాయి జూడో పోటీలు
  • వివిధ విభాగాల్లో విజేతల పేర్ల ప్రకటన 

కరీంనగర్, వెలుగు: మూడు రోజులుగా కరీంనగర్ లో నిర్వహిస్తున్న సీఎం కప్ –2024 రాష్ట్ర స్థాయి జూడో పోటీలు ఆదివారం ముగిశాయి. ఇందులో 29 జిల్లాల నుంచి 400కు పైగా క్రీడాకారులు పాల్గొన్నారు.  గర్ల్స్ కేటగిరీలో 36 కేజీల విభాగంలో ఇ. అక్షత(హనుమకొండ), సీహెచ్.  హిమవర్ధిని(భద్రాద్రి), వి. సిరిచందన(వరంగల్) ఫస్ట్, సెకండ్, థర్డ్ ప్రైజ్ లు గెలుపొందారు. 

40 కేజీల విభాగంలో డి. సునీత(ఆదిలాబాద్), నాగిని ప్రియ(నల్లగొండ), ఫామిదా(హైదరాబాద్), 44 కేజీల విభాగంలో జి.సహస్ర(ఆదిలాబాద్), డి.కీర్తి(నిజామాబాద్), కె. సహజ(హనుమకొండ), 48 కేజీల విభాగంలో ఎస్. రమ్య(ఆదిలాబాద్), సీహెచ్. చరిష్మ(భద్రాద్రి), బి.నక్షత్ర (హనుమకొండ), 52 కేజీల విభాగంలో ఆర్.చాందిని(ఆదిలాబాద్), సావిత్రి (నారాయణపేట), శ్రీ రష్మిత(యాదాద్రి), 57 కేజీల విభాగంలో కె. అలేఖ్య(ఆదిలాబాద్), బి.స్పందన(ఖమ్మం), తేజశ్రీ(నిజామాబాద్), 63 కేజీల విభాగంలో ఎన్.శ్రీజ (వరంగల్), వి.కావ్య(సూర్యాపేట), వి.సాయి ప్రీతి(రంగారెడ్డి), 70 కేజీల విభాగంలో కె. రేవతి(వికారాబాద్), ఎ.సుష్మిత(కరీంనగర్), కె.కృప(హనుమకొండ), 70 కేజీల విభాగంలో ఎంఎస్ శివాని(హైదరాబాద్), వెంకట రితిక(కరీంనగర్), కె. బ్లెస్సీ(సూర్యాపేట) వరుసగా ఫస్ట్, సెకండ్, థర్డ్ ప్లేసుల్లో నిలిచారు. 

బాయ్స్ విభాగంలో.. 

30 కేజీలో బాయ్స్ కేటగిరీలో కె. కార్తీక్(కరీంనగర్), కె. రిత్విక్(పెద్దపల్లి), రతన్ సింగ్(యాదాద్రి), 35 కేజీలో విభాగంలో పి. శివ(యాదాద్రి), మనోజ్ కుమార్(వనపర్తి), బి. ఆదిశేషు(సిరిసిల్ల), 40 కేజీల విభాగంలో ఎం. ప్రవీణ్(నల్లగొండ), జి. వినయ్(నారాయణపేట), ఎ. అక్షయ్(వరంగల్), 45 కేజీల విభాగంలో బి. రాఘవ(జయశంకర్ భూపాలపల్లి), ఎస్. నితిన్(జనగాం), ఎండీ మజకీర్(హైదరాబాద్), 50 కేజీల విభాగంలో ఎల్. సతీశ్​(ఆదిలాబాద్), ఎ.రామతేజ(నిజామాబాద్), బి. గణేశ్(కరీంనగర్) వరుసగా ఫస్ట్, సెకండ్, థర్డ్ ప్లేసుల్లో నిలిచారు. 

అలాగే 55 కేజీల విభాగంలో ఆర్. తరుణ్(ఆదిలాబాద్), పి.ప్రశాంత్(భద్రాద్రి కొత్తగూడెం), ఎండీ సైతుద్దీవ్ ఖాన్(హైదరాబాద్), 60 కేజీల విభాగంలో శ్రీహరి(జోగులాంబ గద్వాల), బి.సతీశ్ కుమార్(ఖమ్మం), ఎం. హర్షవర్ధన్ (ఆదిలాబాద్), 66 కేజీల విభాగంలో కె. అఖిల్(జయశంకర్ భూపాలపల్లి), ఆర్.గణేశా(కరీంనగర్), ఎండీ నసీరుద్దీన్(వరంగల్), 66 కేజీల విభాగంలో కె. సంజీవ్(హైదరాబాద్), బి.రవి(మహబూబాబాద్), ఆర్.మధు(ఆదిలాబాద్) వరుసగా ఫస్ట్, సెకండ్, థర్డ్ ప్లేస్ సాధించినట్లు జిల్లా యువజన, క్రీడా శాఖ అధికారి శ్రీనివాస్ గౌడ్, ఒలింపిక్ అసోసియేషన్ జనరల్ సెక్రటరీ జనార్దన్ రెడ్డి తెలిపారు.