ఖమ్మంలో ముగిసిన రాష్ట్రస్థాయి వాలీబాల్ పోటీలు

ఖమ్మంలో ముగిసిన రాష్ట్రస్థాయి వాలీబాల్ పోటీలు
  • గర్ల్స్ విభాగంలో నిజామాబాద్ ఫస్ట్ ప్లేస్
  • బాయ్స్ విభాగంలో వరంగల్ ​ఫస్ట్ ప్లేస్

ఖమ్మం టౌన్, వెలుగు :  ఖమ్మం నగరంలోని సర్దార్ పటేల్ స్టేడియం లో మూడురోజుల పాటు జరిగిన సీఎం కప్ రాష్ట్ర స్థాయి వాలీబాల్ పోటీలు ఆదివారం ముగిశాయి. పోటీలు జిల్లా యువజన క్రీడల అధికారి తుంబూరి సునీల్ రెడ్డి పర్యవేక్షణ లో రెండు సెషన్లలో జరిగాయి. ఆదివారం వాలీబాల్ ఫైనల్ పోటీలో జట్లు పోటాపోటీగా తలపడ్డాయి. గర్ల్స్ విభాగంలో నిజామాబాద్ ఫస్ట్ ప్లేస్ లో విజేతలుగా నిలవగా, మహబూబ్ నగర్ సెకండ్, ఖమ్మం థర్డ్, కరీంనగర్ ఫోర్త్ ప్లేస్ లో నిలిచాయి. 

బాయ్స్ విభాగంలో...

బాయ్స్ విభాగం వాలీబాల్ పోటీలో వరంగల్ ఫస్ట్ ప్లేస్ లో విజేత గా నిలవగా, సెకండ్ ప్లేస్ లో మహబూబ్ నగర్, థర్డ్ ప్లేస్ లో ఖమ్మం, ఫోర్త్ ప్లేస్ లో రంగారెడ్డి జిల్లాలు కైవసం చేసుకున్నాయి. విజేతలుగా నిలిచిన జట్లను క్రీడల అధికారులు అభినందించారు.