క్రీడాకారుల ప్రతిభను వెలికి తీయాలి : కలెక్టర్ బదావత్ సంతోష్

క్రీడాకారుల ప్రతిభను వెలికి తీయాలి : కలెక్టర్  బదావత్  సంతోష్

నాగర్ కర్నూల్ టౌన్, వెలుగు : గ్రామీణ ప్రాంత క్రీడాకారుల ప్రతిభను వెలికి తీయాలని నాగర్​కర్నూల్​ కలెక్టర్  బదావత్  సంతోష్  సూచించారు. శుక్రవారం పట్టణంలో సీఎం కప్  టార్చ్​ ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం క్రీడలకు పెద్దపీట వేయాలన్న సంకల్పంతో ఈ పోటీలను నిర్వహిస్తుందన్నారు.

క్రీడల్లో పాల్గొనడంతో యువత శారీరకంగా, దృఢంగా ఆరోగ్యంగా ఉంటారన్నారు. గ్రామీణ ప్రాంతాల్లో ఉండే వారిని రాష్ట్ర, జాతీయ స్థాయి క్రీడాకారులుగా తీర్చిదిద్దడమే సీఎం కప్​ ఉద్దేశమని తెలిపారు. జిల్లా యువజన క్రీడల అధికారి సీతారాం, ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు.

వనపర్తి : పల్లెల్లోని క్రీడాకారుల నైపుణ్యాన్ని వెలికి తీసేందుకు సీఎం  కప్  దోహదం చేస్తుందని వనపర్తి అడిషనల్  కలెక్టర్​ సంచిత్ గంగ్వార్  పేర్కొన్నారు. వనపర్తి బాయ్స్​ హైస్కూల్​ గ్రౌండ్​ నుంచి సీఎం కప్​ సంఘీభావ ర్యాలీ నిర్వహించారు.  ఈ సందర్భంగా ఆయన  మాట్లాడుతూ వచ్చే నెల మొదటి వారంలో గ్రామ, మండల, జిల్లా స్థాయిల్లో సీఎం కప్  పోటీలు నిర్వహించడం జరుగుతుందని

అత్యుత్తమ క్రీడాకారులు హైదారాబాద్ లో జరిగే రాష్ట్ర స్థాయి పోటీల్లో పాల్గొనవచ్చన్నారు. గ్రామీణ క్రీడాకారుల్లో సామర్థ్యాన్ని వెలికి తీసి విజేతలుగా నిలిపేందుకు ఈ క్రీడలు ఎంతో ఉపయోగకరంగా ఉంటాయన్నారు. డీఎస్పీ వెంకటేశ్వర రావు,  జిల్లా యువజన, క్రీడల  అధికారి సుధీర్ రెడ్డి, గోకుల్, రతన్ కుమార్ బోస్,  మధు,  పీఈటీ సురేందర్  పాల్గొన్నారు.