అంతా ‘ఛావా’ మూవీ వల్లే.. నాగ్పూర్ హింసపై సీఎం ఫడ్నవీస్ సంచలన కామెంట్స్

అంతా ‘ఛావా’ మూవీ వల్లే.. నాగ్పూర్ హింసపై సీఎం ఫడ్నవీస్ సంచలన కామెంట్స్

మహారాష్ట్ర నాగ్ పూర్ లో రెండు వర్గాల మధ్య హింస చినికి చినికి గాలివానలా మారుతోంది. ఔరంగజేబు సమాధిని తొలగించాలని విశ్వహిందూ పరిషత్ నిర్వహించిన ర్యాలీ ఘర్షణలకు దారితీసింది. పోలీసులు జోక్యం చేసుకున్నా శాంతించని పరిస్థితి ఏర్పడింది. అల్లర్లను అదుపు చేసేందుకు వెళ్లిన పోలీసులపై కూడా నిరసనకారులు రాళ్లు రువ్వడంతో పోలీసులు తీవ్రంగా గాయపడ్డారు. 

ఇది ప్రీ ప్లాన్ గా జరుగుతున్న హింస అని వీహెచ్ పీ ఆరోపిస్తోంది. అదే సమయంలో ప్రీ ప్లాన్ డ్ గా మరో మణిపూర్ లా మార్చేందుకే ఇలా చేస్తున్నారని ఎంఐఎంతో పాటు ఇతర పార్టీ నాయకులు విమర్శించారు. మీరంటే మీరు కారణమని నేతలు విమర్శించుకుంటున్నారు. 

ఈ అల్లర్లకు కారకులైన 50 మందిని అదుపులోకి తీసుకున్నామని, 5 మందిపైన ఎఫ్ఐఆర్ నమోదు చేసినట్లు నాగ్ పూర్ పోలీస్ కమిషనర్ రవీంద్ర సింఘాల్ మంగళవారం (మార్చి 18) తెలిపారు. 

ALSO READ | ఎంక్వైరీకి రావాలమ్మా.. విష్ణుప్రియకు పిలుపొచ్చింది.. అరెస్ట్ చేస్తారా..?

ఒక వర్గానికి చెందిన గ్రంథాన్ని రైట్ వింగ్ గ్రూప్ తగలబెట్టిందని పుకార్లు రావడంతో నాగ్ పూర్ లో అల్లర్లు ఉధృతం అయ్యాయి. ఛత్రపతి శంభాజీ నగర్ జిల్లాలో మొఘల్ రాజైన ఔరంగజేబ్ సమాధిని తొలగించాలని వీహెచ్ పీ కార్యకర్తలు ఆందోళనలకు దిగారు. అయితే పరిస్థితులను మరింత చేజారేలా సోషల్  మీడియా రెచ్చగొట్టిందని ఆ జిల్లా ఇంఛార్జి మంత్రి ఛంద్రశేఖర్ బవాంకులే అన్నారు. ప్రజలు సహనంతో ఉండాలని ఆయన పిలుపునిచ్చారు.

అంతా ఛావా మూవీ వల్లే:

నాగ్ పూర్ అల్లర్లపై సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ చాలా సీరియస్ గా స్పందించారు. చట్టాన్ని చేతుల్లోకి తీసుకోవాలని చూస్తే ఊరుకునే ప్రసక్తి లేదని హెచ్చరించారు. అల్లర్లలో 33 మంది పోలీసులు గాయపడ్డారని, ఆందోళన కారులపై  కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపారు. 

నాగ్ పూర్లో జరుగుతున్న అల్లర్లు ప్రీ ప్లాన్ డ్ గా చేస్తున్నవేనని సీఎం అన్నారు. ‘ఛావా’ సినిమా ప్రజల్లో ఆగ్రహావేశాలు రగిలించిందని, ప్రజలు సంయమనం పాలించాలని అన్నారు. ఛావా మూవీ ఔరంగజేబు పై ఆగ్రహం పెంచేలా చేసిందని, ప్రజలు శాంతియుతంగా ఉండాలని పిలుపునిచ్చారు. 

మరో మణిపూర్ లా మార్చాలనుకుంటున్నారు: విపక్షాలు

మతసామరస్యంతో ప్రశాంతంగా ఉన్న మహారాష్ట్రను మరో మణిపూర్ లా మార్చాలని చూస్తున్నారని, దీనికి ప్రభుత్వమే బాధ్యత వహించాలని యూబీటీ నేత ఆదిత్య థాక్రే అన్నారు. ఈ అల్లర్లను కంట్రోల్ చేయడంలో ప్రభుత్వం విఫలమైందని, దీని వెనక ఉన్న బాధ్యులెవరినైనా కఠినంగా శిక్షించాలని కాంగ్రెస్ ఎంపీ ఇమ్రాద్ మసూద్ డిమాండ్ చేశారు. 

ALSO READ | బెట్టింగ్ యాప్ ప్రమోషన్స్ లో విజయ్ దేవరకొండ, నిధి అగర్వాల్.. కేసు పెడాతారా..?

మరోవైపు ఔరంగజేబ్ మోసగాడు, దుర్మార్గుడని ఈ సందర్భంగా డిప్యూటీ సీఎం ఏక్ నాథ్ శిండే అన్నారు. మరో బీజేపీ ఎమ్మెల్యే బాలాముకుంద్ ఆచార్య మాట్లాడుతూ.. ఔరంగ జేబ్ దోపిడీ దారుడని, దేశానికి వచ్చి దోపిడీ చేశాడని, వారితో వచ్చిన దోపిడి దారులు ఇప్పటికీ ఇండియాలో ఉన్నారని, వాళ్లకు భారత్ ఉండే అర్హత లేదని వివాదాస్పద వ్యాఖ్యాలు చేశారు. ప్రజలను సంయమనంలో ఉంచి శాతి పరిరక్షణకు పాటుపడాల్సిన అధికార పక్ష నేతలే వివాదాస్పద వ్యాఖ్యలు చేయడం దారుణమని ప్రతిపక్ష సభ్యులు విమర్శించారు.