రేపు ఎస్సీ​కులాల..ఏకసభ్య కమిషన్ బహిరంగ విచారణ

రేపు ఎస్సీ​కులాల..ఏకసభ్య కమిషన్ బహిరంగ విచారణ

హైదరాబాద్ సిటీ, వెలుగు : ఎస్సీ కులాల వర్గీకరణ కోసం రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఏక సభ్య కమిషన్ మంగళవారం బహిరంగ విచారణ నిర్వహించి వినతులు స్వీకరిస్తుందని హైదరాబాద్ కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి తెలిపారు. జస్టిస్ డాక్టర్ షమీం అక్తర్​ఆధ్వర్యంలో రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఏక సభ్య కమిషన్ విచారణ చేపడుతుందని, జిల్లాలోని ఎస్సీ కులాల సంఘం లీడర్లు పాల్గొనాలని కోరారు. విచారణ ఉదయం 10.30 గంటల నుంచి మధ్యాహ్నం 2.30 గంటల వరకు హైదరాబాద్ కలెక్టరేట్​లో ఉంటుందన్నారు.