- నలుగురు కేంద్ర మంత్రులకు సీఎం రేవంత్ ఆహ్వానం
- అమిత్ షా, గజేంద్రసింగ్ షెకావత్, కిషన్‌రెడ్డి, బండి సంజయ్‌కి లేఖలు
హైదరాబాద్, వెలుగు: రాష్ట్రప్రభుత్వం ఆధ్వర్యంలో ఈ నెల 17ననిర్వహించనున్న ప్రజా పాలన దినోత్సవ కార్యక్రమాలకు హాజరుకావాని నలుగురు కేంద్ర మంత్రులను సీఎం రేవంత్ రెడ్డి ఆహ్వానించారు.
ఈ మేరకు కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా, కేంద్ర పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి గజేంద్రసింగ్ షెకావత్, కేంద్ర గనుల శాఖ మంత్రి జి.కిషన్ రెడ్డి, కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి బండి సంజయ్‌కి సీఎం శుక్రవారం లేఖలు పంపించారు.
1948 సెప్టెంబరు 17న తెలంగాణలో ప్రజాస్వామిక పాలన శకం ఆరంభమైన సందర్భాన్ని పురస్కరించుకొని తెలంగాణ ప్రజా పాలన దినోత్సవం నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించిందని వెల్లడించారు. హైదరాబాద్ నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో జరిగే కార్యక్రమానికి హాజరుకావాలని కేంద్ర మంత్రును సీఎం కోరారు.