ఓటు వేసిన సీఎం జగన్, చంద్రబాబు

ఏపీ ఎన్నికల్లో తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు ప్రముఖులు. రాష్ట్ర వ్యాప్తంగా ఉదయం 7 గంటల నుంచి పోలింగ్ ప్రారంభమైంది. కడప జిల్లా భాకరాపురంలో కుటుంబ సమేతంగా సీఎం జగన్ ఓటు హక్కును వినియోగించుకున్నారు.  ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఒక్కరు ఓటు వేయాలని సూచించారు.

మరోవైపు ఉండవల్లిలో టీడీపీ అధ్యక్షులు చంద్రబాబు, భువనేశ్వరి లోకేష్ సహా కుటుంబ సభ్యులు తమ ఓటు వేశారు. జీఆర్ఎస్ఆర్ ఎంపీపీ స్కూల్లో ఓటు హక్కును వినియోగించుకున్నారు.   ప్రజందరూ తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని కోరారు.