పిఠాపురంలో ఎన్నికల చివరి ప్రచార సభను పిఠాపురంలో నిర్వహించి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తో పాటు కూటమికి కూడా షాక్ ఇచ్చిన జగన్ ప్రచారంలో భాగంగా కీలక వ్యాఖ్యలు చేశారు. వంగా గీతను గెలిపిస్తే డిప్యూటీ సీఎం చేస్తానని అన్నారు. గీతను గెలిపిస్తే పిఠాపురంలోనే ఉంటూ ప్రజలకు అందుబాటులో ఉంటుందని, పవన్ కళ్యాణ్ ఎన్నికలయ్యాక హైదరాబాద్ పారిపోతారని అన్నారు. జగన్ గెలిస్తేనే పథకాలన్నీ కొనసాగుతాయని, కూటమి గెలిస్తే పథకాలకు ముగింపు పలికినట్లే అని అన్నారు.
ఈ ఎన్నికలు వచ్చే ఐదేళ్లు ఇంటింటి అభివృద్ధిని నిర్ణయించే ఎన్నికలని అన్నారు జగన్. కూటమి నేతలు గత ఎన్నికల్లో ప్రకటించిన మేనిఫెస్టోను చెత్తబుట్టలో పడేశారని అన్నారు. చంద్రబాబుకు ఓటేస్తే కొండచిలువ నోట్లో తలా పెట్టినట్లే అని అన్నారు. 14ఏళ్ళ చంద్రబాబు పాలనలో ఒక్క మంచి పని అయినా చేశారా, బాబు పేరు చెబితే ఒక్క మంచి పని కూడా గుర్తు రాదని అన్నారు జగన్.