మేమంతా సిద్ధం బస్సు యాత్ర చివరి రోజు టెక్కలిలో బహిరంగసభలో పాల్గొన్న సీఎం జగన్ టీడీపీ అధినేత చంద్రబాబుపై ఘాటైన వ్యాఖ్యలు చేశారు. చంద్రబాబు పేరు చెబితే ఒక్క మంచి పని కూడా గుర్తుకు రాదని, ఎన్నికల తర్వాత మేనిఫెస్టోను చెత్తబుట్టలో పడేసిన చరిత్ర చంద్రబాబుది అని అన్నారు. చంద్రబాబులాగా మోసపూరిత హామీలు ఇవ్వలేనని, సాధ్యమయ్యే హామీలు మాత్రమే ఇస్తానని అన్నారు. గత ఎన్నికల్లో చంద్రబాబు ఇచ్చిన హామీలను ఒక్కటి కూడా నెరవేర్చలేదని అన్నారు.
రుణమాఫీ చేస్తానని చెప్పి రైతులను డ్వాక్రా మహిళలను చంద్రబాబు మోసం చేసాడని అన్నారు. ఇంటింటికీ ఉద్యోగం ఇస్తానని, నిరుద్యోగ భృతి ఇస్తానని హామీ ఇచ్చి ఇవ్వలేదని అన్నారు. జగన్ మార్క్ ప్రతి పేద వాడి ఇంట్లో కనిపిస్తుందని, అక్క చెల్లెమ్మల చిరునవ్వులో కనిపిస్తుందని, ప్రతి గ్రామంలోను కనిపిస్తుందని అన్నారు. మాట మీద నిలబడే జగన్ కావాలో, మోసం, దగా చేసే చంద్రబాబు కావాలో ఆలోచించాలని అన్నారు సీఎం జగన్.