చంద్రబాబు పగలు బీజేపీతో, రాత్రి కాంగ్రెస్ తో కాపురం చేస్తున్నారు.. సీఎం జగన్ 

ఏపీలో ఎన్నికల ప్రచార పర్వం మరి కొన్ని గంటల్లో ముగియనున్న నేపథ్యంలో నేతలంతా ఆఖరి దశ ప్రచారంలో మునిగిపోయారు. ఈ క్రమంలో కడపలో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న సీఎం జగన్ చంద్రబాబును ఉద్దేశించి ఘాటైన వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ కు ఓటేస్తే చంద్రబాబుకు వేసినట్లే అని, రేవంత్ రెడ్డి కూడా చంద్రబాబు మనిషే అని అన్నారు. చంద్రబాబు పగలు బీజేపీతో, రాత్రి కాంగ్రెస్ నాతో కాపురం చేస్తున్నారని అన్నారు.

చంద్రబాబు పేరు చెబితే ఒక్క మంచి పని కూడా గుర్తు రాదని, 2014 ఎన్నికల్లో చంద్రబాబు ఇచ్చిన ఒక్క హామీ కూడా నెరవేర్చలేదని అన్నారు. చంద్రబాబుకు ఓటేస్తే కొండచిలువ నోట్లో తల పెట్టినట్లే అని అన్నారు. జగన్ కు ఓటేస్తేనే పథకాలు కొనసాగుతాయని, చంద్రబాబుకు ఓటేస్తే పథకాలకు ముగింపే అని అన్నారు. ఆరు నూరైనా ముస్లిం రిజర్వేషన్లు కొనసాగాల్సిందే అని, రిజర్వేషన్ల విషయంలో చంద్రబాబు డ్రామా ఆడుతున్నారని మండిపడ్డారు.