ఆ ముగ్గరు ఎన్నికల కోసమే ఏపీకి వచ్చారు.. సీఎం జగన్

 ఏపీలో ఎన్నికలు సమీపిస్తున్న సమయంలో పొలిటికల్ హీట్ పీక్స్ కి చేరింది. ఎన్నికలకు రెండు వారల సమయం మాత్రమే ఉన్న నేపథ్యంలో ప్రచారాన్ని ముమ్మరం చేశారు నేతలు. అధికార వైసీపీ మేనిఫెస్టో కూడా ప్రకటించిన నేపథ్యంలో హడావిడి మరింత పెరిగింది. ఈ క్రమంలో మలి విడత ఎన్నికల ప్రచారంలో పాల్గొంటున్న జగన్ చంద్రబాబు, పవన్ కళ్యాణ్ లపై ఘాటైన వ్యాఖ్యలు చేశారు.2014లో కూడా టీడీపీ, జనసేన, బీజేపీలు కూటమిగా వచ్చి ప్రజలను మోసం చేశాయని అన్నారు.

చంద్రబాబు, పవన్ కళ్యాణ్, పురందేశ్వరి ఎన్నికల కోసమే ఏపీకి వచ్చారని అన్నారు. బాబు, పవన్ లు ఎన్నికలయ్యాక హైదరాబాద్ కు వెళ్తారని అన్నారు. చంద్రబాబు మాయమాటలు నమ్మద్దని అన్నారు జగన్. రుణమాఫీ చేస్తానని చెప్పి రైతులు, డ్వాక్రా మహిళలను మోసం చేసారని అన్నారు. చంద్రబాబులాగా సెల్ ఫోన్ కనిపెట్టానని తాను గొప్పలు చెప్పటం లేదని, సాధ్యమయ్యే హామీలే ఇస్తున్నాని అన్నారు జగన్.