మేమంతా సిద్ధం సభలను ముగించుకొని శనివారం మేనిఫెస్టో ప్రకటించిన జగన్, ఇవాళ మలి విడత ప్రచారాన్ని ప్రారంభించారు. ఈ ప్రచారంలో భాగంగా తాడిపత్రి, వెంకటగిరిలో పర్యటించారు జగన్. ఈ నేపథ్యంలో టీడీపీ అధినేత చంద్రబాబును ఉద్దేశించి ఘాటైన వ్యాఖ్యలు చేశారు జగన్. చంద్రబాబు పేరు చెబితే ఒక్క మంచి పని కూడా గుర్తు రాదని, చంద్రబాబుకు ఓటేస్తే చంద్రముఖిని నిద్ర లేపినట్లే అని అన్నారు. 2014 ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీల్లో చణద్రబాబు ఒక్కటి కూడా అమలు చేయలేదని అన్నారు.
రుణమాఫీ చేస్తానని చెప్పి అధికారంలోకి వచ్చాక రైతులను, డ్వాక్రా మహిళలను ముంచారని అన్నారు. ప్రతి నగరానికి హైటెక్ సిటీ కడతానని చెప్పి మోసం చేశారని అన్నారు. చంద్రబాబు హయాంలో జన్మభూమి కమిటీలను తెచ్చారని, తన హయాంలో వాలంటీర్ వ్యవస్థను తెచ్చానని అన్నారు. వాలంటీర్ వ్యవస్థను రద్దు చేస్తానని చెప్పే దైర్యం చంద్రబాబుకు లేదని అన్నారు. జగన్ కు ఓటేసస్తే ఇప్పుడున్న పథకాలు కొనసాగుతాయని, బాబుకు ఓటేస్తే పథకాలకు ముగింపు పలుకుతాడని అన్నారు జగన్.