ఏపీలో ఎన్నికల సంపిస్తున్న వేళ పొలిటికల్ హీట్ పీక్స్ కి చేరింది. నామినేషన్ల పర్వం కూడా మొదలైన క్రమంలో ఎన్నికల హడావిడి ఊపందుకుంది. ఎన్నికలకు నెలరోజుల సమయం కూడా లేకపోవటంతో నేతలంతా ప్రచారాన్ని ముమ్మరం చేశారు. ఈ నేపథ్యంలో ఎన్నికల ప్రచారంలో పాల్గొంటున్న సీఎం జగన్ టీడీపీ అధినేత చంద్రబాబును ఉద్దేశించి ఘాటైన వ్యాఖ్యలు చేశారు. చంద్రబాబుకు ఓటేస్తే సంక్షేమ పథకాల్లో కత్తిరింపులు మొదలవుతాయని అన్నారు.
చంద్రబాబుకు ఓటేస్తే చంద్రముఖి నిద్ర లేస్తుందని, పిల్లల చదువులను అడ్డుకుంటుందని అన్నారు. చంద్రబాబుకు ఓటేస్తే, అరుంధతి సినిమాలోని పశుపతిలా వదల బొమ్మాలి వదల అంటూ వచ్చి అవ్వ, తాతలకు పెన్షన్ అందకుండా అడ్డుపడతాడని అన్నారు. చంద్రబాబు పేరు చెబితే గుర్తొచ్చే పథకం ఒక్కటి కూడా లేదని కూటమి తనపై గులకరాళ్ళను వేస్తోందని అన్నారు జగన్. ఎవరు వస్తే మీకు మంచి జరుగుతుందో అలోచించి ఓటేయాలని ప్రజలను కోరారు జగన్.