చెల్లూరులో నిర్వహించిన మేమంతా సిద్ధం ఎన్నికల ప్రచార సభలో సీఎం జగన్ టీడీపీ అధినేత చంద్రబాబును ఉద్దేశించి ఘాటైన వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రాన్ని దోచుకోవటం, పంచుకోవటమే చంద్రబాబు పని అని, బాబు పాలనలో స్కాములు మాత్రమే ఉంటాయని అన్నారు. జన్మభూమి కమిటీలతో చంద్రబాబు దోపిడీలకు పాల్పడ్డారని అన్నారు. 2014 ఎన్నికల్లో మహిళలకు చంద్రబాబు అనేక హామీలిచ్చారని, వాటిలో ఏ ఒక్కటి కూడా అమలు చేయలేదని అన్నారు.చంద్రబాబు పాలన అంతా దగా, మోసం అని మండిపడ్డారు.
చంద్రబాబు హయాంలో అవ్వ, తాతలకు వెయ్యి రూపాయలు మాత్రమే పెన్షన్ ఇచ్చారని, తమ ప్రభుత్వం వచ్చాక 3వేల రూపాయలు వాలంటీర్ల ద్వారా ఇంటివద్దకే పంపుతున్నామని అన్నారు. ఎలాంటి ఇబ్బంది లేకుండా పెన్షన్ అందుకోవాలన్నది అవ్వ, తాతల డ్రీమ్ అని, వారి డ్రీమ్ తమ ప్రభుత్వం వచ్చాక నెరవేరిందని అన్నారు. ప్రజల డ్రీమ్స్, తమ ప్రభుత్వంలో స్కీమ్స్ రూపంలో నెరవేరయని అన్నారు సీఎం జగన్.
also read : బాలయ్యకు షాక్: హిందూపురంలో పోటీకి దిగిన స్వామిజీ