చంద్రబాబు డబ్బులు ఇస్తే తీసుకోండి... ఓటు మాత్రం నాకే వేయండి.. సీఎం జగన్

ఏపీలో అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికలకు మరో నాలుగు రోజులు మాత్రమే ఉన్న క్రమంలో రాజకీయ వేడి రెట్టింపయ్యింది. పోలింగ్ తేదికి సమయం ముంచుకొస్తున్న నేపథ్యంలో నేతల మధ్య మాటల యుద్ధం పీక్స్ కి చేరింది. ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న సీఎం జగన్ టీడీపీ అధినేత చంద్రబాబును ఉద్దేశించి ఘాటైన వ్యాఖ్యలు చేశారు. చంద్రబాబు దగ్గర చాలా డబ్బులు ఉందని, ఓటుకు రూ.2వేలు, 4వేలు ఇస్తే వద్దనకుండా తీసుకోవాలని, ఓటు మాత్రమే జగన్ కే వేయాలని అన్నారు సీఎం జగన్.

2014 ఎన్నికల సమయంలో చంద్రబాబు మేనిఫెస్టోలో ఇచ్చిన హామీల్లో ఒక్కటి కూడా నెరవేర్చలేదని అన్నారు. చంద్రబాబుకు ఓటేస్తే పథకాలకు ముగింపు పలికినట్లే అని, జగన్ కు ఓటేస్తేనే పథకాల కొనసాగింపు అని అన్నారు జగన్. మోడీ, అమిత్ షా సభల్లో ఎక్కడ కూడా ప్రత్యేక హోదా ప్రస్తావన తేలేదని, చంద్రబాబు, పవన్ కళ్యాణ్ లు వాళ్లకు కావాల్సినవి మాత్రమే మాట్లాడారని అన్నారు.