ఎన్నికలకు సమయం ముంచుకొస్తున్న సమయంలో ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రాజకీయ దుమారం రేపుతోంది. ఈ యాక్ట్ ద్వారా సీఎం జగన్ ప్రజల భూములు దోచుకునేందుకు ప్లాన్ చేస్తున్నారని ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి. ఈ క్రమంలో ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అంశం ఎన్నికల్లో కీలకంగా మారింది. హిందూపురంలో ఎన్నికల ప్రచారంలో పాల్గొంటున్న సీఎం జగన్ ఈ అంశంపై స్పందించాడు. అసలు ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అంటే ఏంటో చంద్రబాబుకు తెలుసా అని ప్రశ్నించాడు.
31లక్షల మంది పేదలకు ఇళ్ల స్థలాలు ఇచ్చిన జగన్ కు ఇవ్వడమే తప్ప, భూములు లాక్కోవడం తెలీదని అన్నారు. చంద్రబాబు దిక్కుమాలిన రాజకీయాలు చేస్తున్నారని మండిపడ్డారు.2014 ఎన్నికల్లో ఇచ్చిన ఒక్క హామీ కూడా నెరవేర్చని చంద్రబాబు మళ్ళీ మోసం చేసేందుకు సిద్ధమయ్యాడని, చంద్రబాబు మోసపు మాటల నమ్మొద్దని అన్నారు జగన్. మరో, పదిరోజుల్లో ఎన్నికలు ఉండగా రాజకీయ దుమారం రేపుతున్న ఈ అంశం ఎన్నికల్లో ఎలాంటి ప్రభావం చూపుతుందో చూడాలి.