ఏపీలో అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికలు కీలక దశకు చేరుకున్నాయి. అధికార ప్రతిపక్ష పార్టీలు మేనిఫెస్టో కూడా ప్రకటించిన నేపథ్యంలో ప్రస్తుతం చర్చంతా మేనిఫెస్టోలోని హామీల మీదనే జరుగుతోంది. ప్రస్తుతం ఉన్న పథకాలకే నగదు పెంచి వైసీపీ మేనిఫెస్టో రూపొందించగా, సూపర్6 అంటూ జనాకర్షక పథకాలతో మేనిఫెస్టో రూపొందించారు చంద్రబాబు. ఈ క్రమంలో సీఎం జగన్ కూటమి మేనిఫెస్టో మీద ఘాటైన వ్యాఖ్యలు చేశారు. చంద్రబాబు పెన్షన్ హామీని మేనిఫెస్టో నుండి అప్పుడే ఎత్తేశారని, చంద్రబాబు మేనిఫెస్టో మాయలను నమ్మొద్దని అన్నారు.
సూపర్6 పేరుతో మొదట మినీ మేనిఫెస్టో ప్రకటించిన చంద్రబాబు, ఆ తర్వాత కూటమి ఉమ్మడి మేనిఫెస్టోలో పెన్షన్ హామీని 5వ పేజీకి షిఫ్ట్ చేశాడు. కాగా, నిన్న ఇచ్చిన ఒక పత్రికా ప్రకటనలో సూపర్6 హామీల్లో పెన్షన్ హామీ లేకపోవడాన్ని ఉద్దేశిస్తూ జగన్ ఈ వ్యాఖ్యలు చేశారు. చంద్రబాబు మేనిఫెస్టో మాయలను నమ్మొద్దని, గతంలో చంద్రబాబు ఇచ్చిన హామీలను ఏ ఒక్కటి కూడా నెరవేర్చలేదని అన్నారు.ఒక్క నెల ఓపిక పడితే, మళ్ళీ సీఎంగా ప్రమాణ స్వీకారం చేస్తానని, పెన్షన్ మళ్ళీ ఇంటికే వస్తుందని అన్నారు జగన్.