ముస్లిం రిజర్వేషన్లపై సీఎం జగన్ కీలక వ్యాఖ్యలు..

2024 సార్వత్రిక ఎన్నికలకు సమయం ముంచుకొస్తోంది. ముస్లిం రిజర్వేషన్ల అంశం దేశవ్యాప్తంగా రాజకీయ దుమారం రేపుతోంది.ఎన్డీయే తిరిగి అధికారంలోకి వస్తే ముస్లిం రిజర్వేషన్లు రద్దు చేస్తుందంటూ జోరుగా ప్రచారం జరుగుతోంది. తాజాగా సీఎం జగన్ కూడా ఈ అంశాన్ని ప్రస్తావించారు.చంద్రబాబు ఓ వైపు ఎన్డీయేలో కొనసాగుతూ మైనార్టీలపై దొంగ ప్రేమ కురిపిస్తున్నాడని అన్నారు. ముస్లిం రిజర్వేషన్లు రద్దు చేస్తామంటున్న ఎన్డీయేతో చంద్రబాబు జతకట్టారని, వెనుకబాటుకు గురైన వారి రిజర్వేషన్లు తొలగించటం కరెక్టేనా అని  ప్రశ్నించారు.

ఈ నేపథ్యంలో ముస్లింలకు 4% రిజర్వేషన్ ను కొనసాగిస్తామని హామీ ఇచ్చారు జగన్. ఆరునూరైనా ముస్లిం రిజర్వేషన్లు కొనసాగించాల్సిందే అని అన్నారు. అంతే కాకుండా, NRC, CAA అంశాల్లో మైనార్టీలకు అండగా ఉంటానని హామీ ఇచ్చారు జగన్. రిజర్వేషన్ల అంశం దుమారం రేపుతున్న సమయంలో సీఎం జగన్ వ్యాఖ్యలు హాట్ టాపిక్ గా మారాయి. మరి, జగన్ వ్యాఖ్యలకు చంద్రబాబు నుండి కౌంటర్ ఉంటుందా లేదా చూడాలి.