కాకినాడలో నిర్వహించిన మేమంతా సిద్ధం బహిరంగ సభలో పాల్గొన్న సీఎం జగన్ జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పై ఘాటైన వ్యాఖ్యలు చేశారు. గతంలో చాలాసార్లు వైసీపీ, జనసేనల మధ్య మాటల యుద్దానికి దారి తీసిన పవన్ కళ్యాణ్ పెళ్లిళ్ల ప్రస్తావన తెచ్చాడు జగన్. ప్యాకేజ్ స్టార్ కి పెళ్లిళ్లే కాదు, ఇప్పుడు నియోజకవర్గాలు కూడా నాలుగు అయ్యాయని ఘాటైన వ్యాఖ్యలు చేశారు. పవన్ కళ్యాణ్ కు ఏ భార్య అయినా ప్రేమ ఉండదు, ఏ ప్రాంతం అయినా ప్రేమ ఉండదని అన్నారు.
దత్తపుత్రుడికి ఎన్ని సీట్లివ్వాలో, ప్యాకేజ్ స్టార్ ఎక్కడ పోటీ చేయాలో కూడా చంద్రబాబే నిర్ణయిస్తాడని, అందుకే పొత్తు ఏర్పడిందని అన్నారు. కులాన్ని హోల్ సేల్ గా చంద్రబాబుకు అమ్మేయగలను అనే భ్రమతోనే పవన్ రాజకీయం చేస్తున్నాడని అన్నారు. చంద్రబాబుకు ఓటేస్తే సంక్షేమ పథకాల్లో కత్తిరింపులు మొదలవుతాయని, ఫ్యాన్ గుర్తు మీద రెండు ఓట్లు వేస్తేనే సంక్షేమ పథకాలు కొనసాగుతాయని అన్నారు. ఎవరికీ ఓటేస్తే మంచి జరుగుతుందో అలోచించి ఓటేయాలని ప్రజలను కోరారు జగన్.
also read : చంద్రబాబుకు ఓటేస్తే కత్తిరింపులు మొదలు.. సీఎం జగన్