ఎన్నికల సమరానికి కౌంట్ డౌన్ మొదలైంది.ప్రచార పర్వానికి గడువు కూడా ముగియటంతో నేతలంతా ఓటర్లను ప్రసన్నం చేసుకునే పనిలో పడ్డారు. ఈ క్రమంలో పిఠాపురంలో చివరి ప్రచార సభలో పాల్గొన్న సీఎం జగన్ జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ను ఉద్దేశించి ఘాటైన వ్యాఖ్యలు చేశారు.దత్తపుత్రుడు ఐదేళ్లకోసారి కార్లను మార్చినట్లు భార్యలను మారుస్తాడని అన్నారు. ఇలాంటి పవన్ కళ్యాణ్ ను మహిళలు నమ్మే పరిస్థితిలో ఉన్నారా అన్నారు జగన్.
పవన్ కళ్యాణ్ ఎన్నికల్లో గెలిస్తే పిఠాపురంలో ఉండరని, హైదరాబాద్ వెళ్ళిపోతారని అన్నారు. గత ఎన్నికల్లో గాజువాక, భీమవరం అన్నాడు, ఇప్పుడు పిఠాపురం అంటున్నాడు, ఎన్నికలయ్యాక హైదరాబాద్ పారిపోతాడని అన్నారు జగన్. మొదటి నుండి పవన్ కళ్యాణ్ పోటీ చేస్తున్న పిఠాపురం నియోజకవర్గంపై స్పెషల్ ఫోకస్ పెట్టిన జగన్, చివరి ప్రచార సభను కూడా అక్కడే నిర్వహించటం వంగా గీత గెలుపుపై ఏ మేరకు ప్రభావం చూపుతుందో వేచి చూడాలి.