వైజాగ్ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ ఆపింది నేనే.. సీఎం జగన్

ఎన్నికలకు సమయం ముంచుకొస్తున్న వేళ ఏపీలో పొలిటికల్ హీట్ పీక్స్ కి చేరింది. పోలింగ్ తేదికి మరో 6రోజులు మాత్రమే సమయం ఉండటంతో అధికార, ప్రతిపక్షాల మధ్య మాటల యుద్ధం పీక్స్ కి చేరింది. ఈ క్రమంలో గాజువాకలో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న సీఎం జగన్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఐదేళ్లుగా నేను ఒప్పుకోలేదు కాబట్టే వైజాగ్ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ జరగలేదని అన్నారు జగన్. పొరపాటున కూటమికి ఓటేస్తే స్టీల్ ప్లాంట్ అమ్మకానికి ఆమోదం తెపినట్లే అని అన్నారు.

విశాఖ రైల్వే జోన్ కి భూములు ఇచ్చినా కేంద్రం తీసుకోలేదని, మోడీ, చంద్రబాబు, పవన్ కళ్యాణ్ కలిసి డ్రామాలు ఆడుతున్నారని మండిపడ్డారు జగన్. అనకాపల్లిలో ఎన్నికల ప్రచార సభలో పాల్గొన్న మోడీ చేసిన వ్యాఖ్యలకు కౌంటర్ ఇచ్చారు జగన్. ప్రత్యేక హోదా, వైజాగ్ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ వంటి అంశాల గురించి మోడీ ఎందుకు ప్రస్తావించలేదని అన్నారు. పోలవరాన్ని చంద్రబాబు ATM లా మార్చుకున్నారని, చంద్రబాబు అత్యంత అవినీతి పరుడని ఆరోపించిన మోడీ గొప్పవాడని అంటున్నారని అన్నారు జగన్. ప్రస్తుతం రాజకీయాలు అంతలా దిగజారిపోయాయని అన్నారు.