మళ్ళీ అధికారంలోకి వస్తా.. వారం రోజుల్లో బటన్లు నొక్కి పథకాలన్నీ క్లియర్ చేస్తా.. సీఎం జగన్

ఏపీలో ఎన్నికలు కీలకదశకు చేరుకున్నాయి. పోలింగ్ తేదికి మరో 6రోజుల సమయం మాత్రమే ఉన్న క్రమంలో నేతల మాటల యుద్ధం పీక్స్ కి చేరింది. మరో పక్క ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై జరుగుతున్న రచ్చతో పాటు స్నాక్షేమ పధకాలకు ఈసీ నో చెప్పటం ఏపీలో రాజకీయంగా దుమారం రేపుతోంది. ఎన్నికల ప్రచారంలో పాల్గొంటున్న సీఎం జగన్ ఈ అంశంపై స్పందించారు.గత ఐదేళ్లుగా  జరుగుతున్న మంచిని అడ్డుకున్నారని, పథకాలు ఆపి జగన్ ను అడ్డుకునేందుకు కుట్ర చేస్తున్నారని అన్నారు.

అక్క, చెల్లెమ్మలు ఓటు అనే ఆయుధంతో బుద్ధి చెప్పాలని అన్నారు.దేవుడి ఆశీస్సులు, అక్క చెల్లెమ్మల దయ ఉన్నంతవరకు మీ బిడ్డ విజయాన్ని ఎవరూ ఆపలేరని అన్నారు జగన్. మీ బిడ్డ జూన్4న మళ్ళీ అధికారంలోకి వస్తాడు, బటన్లన్నీ నొక్కి వారం రోజుల్లో పథకాలన్నీ క్లియర్ చేస్తాడని అన్నారు జగన్. మరి, ఎన్నికలకు ఆరు రోజుల ముందు పథకాలు ఆగడం ఏ మేరకు ప్రభావం చూపుతుందో చూడాలి.