ఏపీలో ఎన్నికలు కీలక దశకు చేరుకున్నాయి. నామినేషన్ల పర్వం కూడా మొదలైన నేపథ్యంలో రాష్ట్రంలో ఎన్నికల హడావిడి ఊపందుకుంది. ప్రధాన పార్టీల నేతలంతా ప్రచారంలో నిమగ్నమవ్వటంతో విమర్శ, ప్రతివిమర్శలతో రాష్ట్రం హోరెత్తుతోంది. ఈ క్రమంలో సీఎం జగన్ టీడీపీ అధినేత చంద్రబాబు వ్యాఖ్యలకు కౌంటర్ ఇచ్చారు. ప్రజాగళంలో సభలో చంద్రబాబు జగన్ ను బచ్చా అంటూ చేసిన కామెంట్స్ కు కౌంటర్ ఇచ్చారు జగన్.
తాను బచ్చా అయితే, తన చేతిలో చిత్తూ చిత్తుగా ఓడిన చంద్రబాబును ఏమనాలని ప్రశ్నించాడు జగన్. నేను బచ్చా అయితే, ఒంటరిగా పోటీ చేస్తున్న నన్ను ఎదుర్కోలేక కూటమిగా ఎందుకు పోటీ చేస్తున్నావని ప్రశ్నించారు జగన్.58నెలల జగన్ పాలనలో సంక్షేమం పెద్ద ఎత్తున జరిగిందని బాబు పేరు చెబితే ఒక్క పథకం అయినా గుర్తొచ్చే పరిస్థితి ఉందా అని ప్రశ్నించారు జగన్.