సోషల్ మీడియా వేధింపులపై జగన్ కీలక నిర్ణయం..

వైసీపీ సోషల్ మీడియా వారియర్స్ తో ముఖాముఖిలో పాల్గొన్న సీఎం జగన్ సంచలన నిర్ణయం తీసుకున్నాడు. సోషల్ మీడియాలో వైసీపీ శ్రేణులపై జరిగే వేధింపులకు అరికట్టేందుకు ఈ నిర్ణయం తీసుకున్నారు జగన్. సోషల్ మీడియాలో ఎవరైనా వేధింపులకు గురైతే సైబర్ క్రైమ్ డిపార్ట్మెంట్ కి ఫిర్యాదు చేయటమే కాకుండా పార్టీ తరఫున ఒక యాప్ రూపొందించాలని, వేధింపులపై చేసిన ఫిర్యాదులను సదరు యాప్ లో పొందుపరిచి ఎప్పటికప్పుడు తనకు అప్డేట్ చేయాలని వైసీపీ మీడియా, సోషల్ మీడియా కో ఆర్డినేటర్ సజ్జల భార్గవ్ రెడ్డికి సూచించారు.

జగన్ హయాంలో అందుకున్న సంక్షేమ పథకాల పట్ల సంతోషాన్ని మీడియాతో పంచుకున్న గీతాంజలి హత్యను గుర్తు చేసుకున్న జగన్ సోషల్ మీడియా కార్యకర్తలకు భరోసా కల్పిస్తూ  ఈ నిర్ణయం తీసుకున్నాడు. జగన్ నిర్ణయం పట్ల వైసీపీ కార్యకర్తలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఈ కార్యక్రమంలో మాట్లాడుతూ తనకున్న ఏకైక ఆయుధం సోషల్ మీడియానే అని అన్నారు సీఎం జగన్.